Ivanka Trump: వ్యక్తిగత సహాయకురాలికి పాజిటివ్... ఇవాంకా ట్రంప్ కు కరోనా పరీక్షలు

Ivanka Trump personal assistant tested corona positive
  • అమెరికా వైట్ హౌస్ లో ముగ్గురికి కరోనా
  • కరోనా బారినపడిన ఇవాంకా వ్యక్తిగత సహాయకురాలు
  • కొన్నివారాలుగా ఇవాంకాకు దూరంగా ఉన్న సహాయకురాలు
అమెరికాలోని వైట్ హౌస్ లోనూ కరోనా కల్లోలం వణికిస్తోంది. ఇప్పటివరకు వైట్ హౌస్ లో ముగ్గురికి కరోనా నిర్ధారణ అయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా వ్యక్తిగత సహాయకురాలికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. కానీ ఆ సహాయకురాలు కొన్నిరోజులుగా ఇవాంకాతో లేదని వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి.

 అమెరికాలో కరోనా కట్టడికి ఆంక్షలు అమల్లో ఉన్నందున రెండు నెలలుగా ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విధులు నిర్వర్తిస్తోందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాంకా ట్రంప్ తో పాటు ఆమె భర్త జారెడ్ కుష్నర్ కు కూడా కరోనా టెస్టులు నిర్వహించారు. వీరిద్దరికీ కరోనా లేదని తేలిందని సీఎన్ఎన్ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది.
Ivanka Trump
Personal Assistant
Corona Virus
Positive
White House
USA

More Telugu News