ఆ 5 గ్రామాల ప్రజలు 48 గంటల పాటు పునరావాస కేంద్రాల్లో ఉండాలి: మంత్రి అవంతి విజ్ఞప్తి
- స్టిరీన్ వాయువును చాలా జాగ్రత్తలు తీసుకుని నియంత్రించాలి
- రెండు రోజుల పాటు ప్రభుత్వానికి సహకరించాలి
- వదంతులను ప్రజలు నమ్మొద్దు
- ఆందోళనలకు గురి కావద్దు
స్టిరీన్ వాయువును చాలా జాగ్రత్తలు తీసుకుని నియంత్రించాల్సి ఉంటుందని అవంతి చెప్పారు. ఆ పరిశ్రమ ఉన్న ప్రాంతంలోని వారంతా రెండు రోజుల పాటు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. గ్యాస్ లీకేజీ ఘటన నేపథ్యంలో వస్తోన్న వదంతులను ప్రజలు నమ్మొద్దని ఆయన కోరారు. ప్రజలు ఎవరూ ఆందోళనలకు గురి కావద్దని చెప్పారు. ఐదు గ్రామాల ప్రజలు 48 గంటల పాటు పునరావాస కేంద్రాల్లో ఉండాలని ఆయన సూచించారు.