సినీ నటుడు విజయ్ సేతుపతిపై అఖిల భారత హిందూ మహాసభ ఆగ్రహం

09-05-2020 Sat 09:14
  • అభిషేకాలు, కైంకర్యాలను తప్పుబట్టిన విజయ్ సేతుపతి
  • చర్యలు తీసుకోవాలంటూ సీపీకి లేఖ
  • విజయ్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
All India Hindu Mahasabha Fires on Vijay Sethupathi
హిందూ దేవుళ్లకు జరిగే అభిషేకం, అలంకరణ, కైంకర్యాలను తప్పుబడుతూ ఓ టీవీ చానల్‌లో సినీ నటుడు విజయ్ సేతుపతి ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా, ఆయన వ్యాఖ్యలపై అఖిల భారత హిందూ మహాసభ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెన్నై నగర పోలీసు కమిషనర్‌కు లేఖ రాసింది. విజయ్ సేతుపతిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

విజయ్ వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఆయన ఎందుకలా మాట్లాడాల్సి వచ్చిందని నిలదీసింది. సొంత ప్రచారం కోసం హిందూ మతమే దొరికిందా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు, నెటిజన్లు కూడా విజయ్ సేతుపతిపై మండిపడుతున్నారు. ట్రోలింగ్, మీమ్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.