Vizag Gas Leak: విశాఖ ఘటనపై దర్యాప్తు కోరుతూ మోదీకి చంద్రబాబు లేఖ

Chandrababu Naidu writes letter to PM Modi
  • సత్వరమే స్పందించినందుకు అభినందనలు
  • విచారణ కోసం సైంటిఫిక్ కమిటీ ఏర్పాటు చేయండి
  • స్టిరీన్‌తోపాటు మరిన్ని వాయువులు కూడా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి
విశాఖపట్టణంలో జరిగిన ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. ప్రధాని మోదీకి లేఖ రాశారు.

తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఈ ఘటనపై సత్వరమే స్పందించినందుకు ప్రధానికి అభినందనలు తెలిపిన చంద్రబాబు.. గ్యాస్ లీకేజీపై విచారణ కోసం సైంటిఫిక్ కమిటీని ఏర్పాటు చేయాలని, విషవాయువు లీకేజీకి దారితీసిన అంశాలపై దర్యాప్తు జరిపించాలని ఆ లేఖలో కోరారు. పరిశ్రమ నుంచి లీకైన వాయువును స్టిరీన్‌గా కంపెనీ చెబుతోందని, కానీ దానితోపాటు మరిన్ని వాయువులు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయని, కాబట్టి ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని చంద్రబాబు ఆ లేఖలో కోరారు.
Vizag Gas Leak
Chandrababu
Narendra Modi

More Telugu News