WBDF: ఇలాగైతే కరోనా రోగులకు వైద్యం చేయడానికి ఎవరూ మిగలరు: బెంగాల్ డాక్టర్ల ఆవేదన

  • బెంగాల్ లో వైద్య సిబ్బందికి కరోనా
  • 140 మందికి పైగా కరోనా సోకినట్టు గుర్తింపు
  • ఇద్దరు వైద్యుల మృతి
Bengal doctors forum rang danger bells in the wake of corona

పశ్చిమ బెంగాల్ లో అనేకమంది వైద్య సిబ్బందికి కరోనా సోకడం పట్ల ది వెస్ట్ బెంగాల్ డాక్టర్స్ ఫోరమ్ (డబ్ల్యూబీడీఎఫ్) ఆందోళన వ్యక్తం చేస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కరోనా రోగులకు వైద్యం చేయడానికి ఎవరూ మిగలరని పేర్కొంది. ఇప్పటికే 140 మందికి పైగా వైద్య సిబ్బంది కరోనా బారినపడ్డారని, ఇద్దరు డాక్టర్లు సైతం మరణించారని డబ్ల్యూబీడీఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది.

 అనేకమంది క్వారంటైన్ లో ఉన్నారని, పరిస్థితి మరింత విషమిస్తే రోగులకు వైద్యం చేయడానికి ఎవరూ ముందుకురారని డబ్ల్యూబీఎఫ్ కార్యదర్శి డాక్టర్ కౌశిక్ చాకీ తెలిపారు. కరోనా వైద్య విధుల్లో ఉన్న డాక్టర్లు, ఇతర సిబ్బందికి తగిన రక్షణాత్మక ఏర్పాట్లు చేయాలంటూ డబ్ల్యూబీడీఎఫ్ ఇప్పటికే రాష్ట్ర సీఎస్ రాజీవ్ సిన్హాకు లేఖ రాసింది. ఒక్కసారిగా డాక్టర్ల కొరత వస్తే పరిస్థితి దిగజారుతుందని, అలాంటి ప్రమాదం రాకుండా చూడాలని కోరింది.

More Telugu News