Jagan: పదవి పోతుందనే సెంటిమెంట్ ఉన్నా.. జగన్ వెళ్లారు: పీవీపీ ట్వీట్

Power is not important to Jagan says PVP
  • 25 ఏళ్ల క్రితం విశాఖ కేజీహెచ్ కు ఎన్టీఆర్ వెళ్లారు
  • ఆ తర్వాత ఆయన పదవి పోయింది
  • అప్పటి నుంచి మరే ముఖ్యమంత్రి అక్కడకు వెళ్లలేదు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు పదవులు ముఖ్యం కాదని వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ అన్నారు. ఈ మేరకు అయన ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. ఒక ముఖ్యమంత్రి ధైర్యం చేసి 25 సంవత్సరాల తర్వాత మళ్లీ విశాఖ కేజీహెచ్ లో అడుగుపెట్టారని చెప్పారు.

1995లో ఎన్టీఆర్ కేజీహెచ్ లో అడుగుపెట్టాక పదవి పోయిందని... ఆ తర్వాత అక్కడ మరే ముఖ్యమంత్రి అడుగుపెట్టలేదని తెలిపారు. మళ్లీ ఇప్పుడు జనాల కోసం జగన్ అడుగుపెట్టారని చెప్పారు. జగన్ కు ప్రజా సంక్షేమమే ప్రధానమని, పదవి కాదని అన్నారు. గ్యాస్ లీక్ ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు కేజీహెచ్ ఆసుపత్రికి జగన్ వెళ్లిన సంగతి తెలిసిందే.
Jagan
PVP
YSRCP
KGH
NTR

More Telugu News