Prabhas: ప్రభాస్ 20వ చిత్రం ప్రారంభోత్సవం ఫొటోలు పోస్టు చేసిన దర్శకుడు రాధాకృష్ణ

Director Radhakrishna shares some pics of Prabhas at his new move launching in past
షార్ట్స్‌లో చూడండి
బాహుబలి చిత్రాల తర్వాత సాహో చిత్రం చేసిన ప్రభాస్ ఆపై జిల్ ఫేమ్ రాధాకృష్ణతో ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఇది ప్రభాస్ కు 20వ చిత్రం. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. ఇదో పీరియాడికల్ లవ్ స్టోరీ అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా కొంత షూటింగ్ కూడా జరుపుకుంది.

ఈ సినిమా ఓపెనింగ్ కు సంబంధించిన ఫొటోలేవీ అప్పట్లో మీడియాలో రాలేదు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు రాధాకృష్ణ నాడు సినిమా ముహూర్తం షాట్ సందర్భంగా తీసిన ఫొటోలను తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా, ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ అనంతరం పునఃప్రారంభం కానుంది.
Go Back to Shorts
Prabhas
Radhakrishna
Prabhas20
Tollywood
Pooja Hegde

More Telugu News