Rahul Gandhi: లాక్‌డౌన్‌ ఎగ్జిట్‌ ప్లాన్‌పై పారదర్శకతతో కూడిన వివరాలు ఇవ్వండి: రాహుల్ గాంధీ

Coronavirus Rahul Gandhi says Government needs to give transparency on lockdown exit plan
  • వలసకూలీల తరలింపుపై వ్యూహాత్మకంగా వ్యవహరించాలి
  • పేదలు, కార్మికులకు సాయం చేయాలి
  • ఏయే జాగ్రత్తలు తీసుకుంటున్నారో చెప్పాలి
కరోనా నుంచి బయటపడేందుకు ప్రణాళికలు రచించాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూచించారు. ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. వలసకూలీల తరలింపుపై వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఆయన చెప్పారు. కష్టసమయంలో పేదలు, కార్మికులకు సాయం చేయాలని, దినసరి కూలీలు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

వలస కూలీలకు త్వరగా ఆర్థిక సాయం చేయాలని రాహుల్ గాంధీ సూచించారు. చిన్న తరహా పరిశ్రమలకు ఇప్పుడు చేయూత ఇవ్వాలని ఆయన కోరారు.  విమర్శలు చేసేందుకు ఇది సమయం కాదని ఆయన అన్నారు. అయితే, లాక్‌డౌన్‌ ఎత్తేసే విషయంపై ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన అన్నారు.

ఏ ప్రాతిపదికన, ఏయే జాగ్రత్తలు తీసుకుంటూ లాక్‌డౌన్‌ ఎత్తేస్తున్నామన్న విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేసి, ఆ తర్వాతే ఆంక్షలు తొలగించాలని చెప్పారు. లాక్‌డౌన్‌ ఎగ్జిట్‌ (ఎత్తివేత) ప్లాన్‌పై పూర్తి పారదర్శకతతో కూడిన వివరాలు ఇవ్వాలని అన్నారు.
Rahul Gandhi
Congress
Corona Virus
Lockdown

More Telugu News