Pawan Kalyan: వలస కూలీల దుర్మరణం బాధాకరం: పవన్ కల్యాణ్

Pawankalyan says the death of migrant workers is painful
  • ఈ ఘటనపై ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా
  • మృతుల కుటుంబాలను  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి
  • క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి 
మహారాష్ట్రలో సంభవించిన రైలు ప్రమాద ఘటనలో మధ్యప్రదేశ్ వలస కూలీలు దుర్మరణం చెందడం బాధాకరమైన విషయమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మృతుల కుటుంబాలకు తన తరఫున, జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ ఘటనలో క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. శ్రామిక్ రైళ్లకు సంబంధించిన సమన్వయ బాధ్యతలను చేపట్టడంలో, సంబంధిత సమాచారాన్ని కూలీలకు అందించడంలో రాష్ట్రాలు మరింత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఈ దుర్ఘటన తెలియజేస్తోందని అన్నారు.
Pawan Kalyan
Janasena
Maharashtra
Migrant workers
Death

More Telugu News