Train Accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం... 15 మంది వలస కార్మికుల మృతి

15 Migrents Dead in Train Accident in Maharashtra
  • ఈ తెల్లవారుజామున ప్రమాదం
  • రైల్వే ట్రాక్ పై నిద్రిస్తున్న వలస కార్మికులు
  • దూసుకెళ్లిన ఖాళీ గూడ్స్ రైలు
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ - నాందేడ్ మార్గంలో ఈ తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు పట్టాలపై నిద్రిస్తున్న వలస కార్మికులపై నుంచి ఓ గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించినట్టు ప్రాథమిక సమాచారం. వీరంతా మధ్యప్రదేశ్ కు చెందిన కార్మికులుగా తెలుస్తోంది.

"కర్మాడ్ ప్రాంతంలో రైలు ప్రమాదం జరిగింది. ఖాళీగా వెళుతున్న గూడ్స్ రైలు కొంతమందిపై నుంచి వెళ్లింది. విషయం తెలుసుకున్న వెంటనే, రైల్వే, స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మరింత సమాచారం వెలువడాల్సివుంది" అని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఓ ప్రకటనలో తెలిపారు.
Train Accident
Maharashtra
Migrents
Goods Train

More Telugu News