Bangladesh: బంగ్లాదేశ్ లో మసీదుల్లో ప్రార్థనలకు అనుమతి

Bangladesh Government has taken decesion to open Mosques
  • ప్రస్తుతం రంజాన్ పవిత్ర మాసం
  • ప్రార్థనలకు వచ్చే వారు ఎవరి మ్యాట్ వారే తెచ్చుకోవాలి
  • భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి 
  • మసీదు పరిసరాల్లో ఇఫ్తార్ విందులు మాత్రం వద్దు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కట్టడికి పలు దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. భారత్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లోనూ ‘కరోనా’ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. అయితే, ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రస్తుతం నడుస్తుండటంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మసీదుల్లో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మసీదుల్లో ప్రార్థనలు చేసేందుకు వచ్చే వారికి కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది.  మసీదుల్లో శానిటైజర్స్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని, ప్రార్థనల నిమిత్తం వచ్చే వారు ఎవరి మ్యాట్ వారే తెచ్చుకోవాలని, భౌతికదూరం పాటించాలని, మసీదుల పరిసరాల్లో ఇఫ్తార్ విందులు నిర్వహించవద్దని ఆదేశించింది. కాగా, మత సంస్థల నుంచి ఒత్తిళ్లు రావడం వల్లే మసీదులు తెరవాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Bangladesh
Mosques
Ramzan
prayers

More Telugu News