Pawan Kalyan: ఈ ఘటన తీవ్రత తెలిసే కొద్దీ ఆందోళన చెందాను: పవన్ కల్యాణ్

Janasena founder pawankalyan statement
  • ఉదయం ఐదున్నర గంటల నుంచే సమాచారం అందింది 
  • గ్యాస్ లీకేజ్ ఘటన చాలా కలచివేసింది
  • మా నాయకులు వెంటనే స్పందించారు
విశాఖపట్టణంలో గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్  తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన తనను చాలా కలచివేసిందని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ఈరోజు ఉదయం ఐదున్నర గంటల నుంచే తనకు అందిందని చెప్పారు.

స్థానికంగా ఉన్న ‘జనసేన’ నాయకులు సంబంధిత వీడియోలను తమ పార్టీ జనరల్ సెక్రటరీకి పంపించారని, అక్కడి నుంచి తనకు చేరాయని అన్నారు.  ఈ ఘటన తీవ్రత తెలిసే కొద్దీ ఆందోళన చెందానని, దారి పొడవునా కింద పడిపోయిన మహిళలు, చిన్నారులతో పాటు చనిపోయిన మూగజీవాలు ఉండటం తనకు చాలా ఆవేదన కల్గించిందని అన్నారు.

ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే జనసేన పార్టీ నాయకులు స్పందించి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ఉపశమనం కలిగించిందని అన్నారు. ఇదే  స్ఫూర్తితో బాధితులకు అండగా నిలబడాలని తమ నాయకులకు పిలుపు నిచ్చారు.
Pawan Kalyan
Janasena
Vizag Gas Leak

More Telugu News