Vizag Gas Leak: గ్యాస్ లీక్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఎంబీబీఎస్ విద్యార్ధి

MBBS student dead in Vizag Gas leak
  • మెడికల్ విద్యార్థి చంద్రమౌళి మృతి
  • ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న చంద్రమౌళి
  • ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు చిన్నారులు

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎంబీబీఎస్ చదువుతున్న చంద్రమౌళి అనే విద్యార్థి కూడా మృతి చెందాడు. ఆంధ్ర మెడికల్ కాలేజీలో చంద్రమౌళి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. గత ఏడాది మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలో అతను మెరిట్ ర్యాంకు సాధించి ఎంబీబీఎస్ సీటు సాధించాడు. తమ కుమారుడు గొప్ప డాక్టరవుతాడని ఆశలు పెట్టుకున్న అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో శ్రేయ (6), గ్రీష్మ (9), చంద్రమౌళి (19), గంగరాజు (48), అప్పల నరసమ్మ (45), నారాయణమ్మ (35), కృష్ణమూర్తి (73), గుర్తు తెలియని వ్యక్తి (30) ఉన్నారు.

  • Loading...

More Telugu News