Sivajiraja: సినీ నటుడు శివాజీరాజాకు స్టెంట్ వేసిన వైద్యులు!

Actor Sivaji Raja underwent successful surgery
  • శివాజీరాజాకు మంగళవారం నాడు గుండెపోటు
  • ఇవాళ యాంజీయోప్లాస్టీ నిర్వహించిన వైద్యులు
  • నిలకడగా ఆరోగ్యం
టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీరాజా మంగళవారం రాత్రి గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. నేడు ఆయనకు హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో యాంజియోప్లాస్టీ నిర్వహించిన వైద్యులు, విజయవంతంగా స్టెంట్ అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. శివాజీరాజా త్వరగా కోలుకోవాలని చిత్ర పరిశ్రమ వర్గాలు అభిలషిస్తున్నాయి.
Sivajiraja
Heart Attack
Angioplasty
Stent
Hyderabad
Tollywood

More Telugu News