Vijaya Devara konda: ఆహారం, వసతి సాయం కోసం ఈ నెంబర్లకు ఫోన్ చేయండి: విశాఖ దుర్ఘటన బాధితులకు విజయ్ దేవరకొండ విజ్ఞప్తి

Hero Vijaya Devara konda tweet
  • విశాఖ ఘటనపై విజయ్ దేవరకొండ స్పందన
  • వైజాగ్ గురించి మేము ఆలోచిస్తున్నాం
  • గోపాలపట్నం ప్రాంతానికి  ‘జటాయు’ బృందం చేరుకుంది
  • ఆహారం, వసతి కోసం 7799439129, 6303616240 ఫోన్ చేయండి
లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న మధ్య తరగతి కుటుంబాలను ఆదుకునే నిమిత్తం ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ ఇప్పటికే సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, విశాఖపట్టణంలో గ్యాస్ లీకేజ్ ఘటనపై స్పందించాడు. వైజాగ్ గురించి తాము ఆలోచిస్తున్నామని, ప్రార్థిస్తున్నామంటూ ఓ ట్వీట్ చేశాడు. విశాఖలోని గోపాలపట్నం ప్రాంతానికి ‘జటాయు’ బృందం సభ్యులు చేరుకున్నారని, ఎవరికైతే ఆహారం, వసతి అవసరం ఉందో వారు తమ సభ్యులకు ఫోన్ చేయాలంటూ రెండు ఫోన్ నంబర్లు 7799439129, 6303616240 తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు.
Vijaya Devara konda
Tollywood
Vizag Gas Leak
Jatayuvu

More Telugu News