Chandrababu: పూర్తి స్థాయిలో విచారణ జరపండి: గ్యాస్‌ లీక్‌ ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ

  • దాదాపు 2,000 మంది అనారోగ్యానికి గురయ్యారు
  • ప్రజారోగ్యంపై తగు చర్యలు తీసుకోవాలి
  • పరిశ్రమలను కాలుష్యం లేని ప్రత్యేక ప్రాంతాలకు తరలించాలి
  • వెంటనే నిపుణులను పంపాలి
chandrababu  on ap gas leak incigent

విశాఖపట్నంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఓ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకైన ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. దాదాపు 2,000 మంది అనారోగ్యానికి గురి కావడం దురదృష్టకరమని చంద్రబాబు అందులో పేర్కొన్నారు. ఓ వైపు కరోనా బాధితులు పెరిగిపోతుండడం, మరోవైపు గ్యాస్ లీక్‌ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని చెప్పారు.

ప్రజారోగ్యంపై తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారు. నిపుణులైన వైద్య సిబ్బందిని పంపాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో పశువులూ చనిపోతోన్న నేపథ్యంలో పశు వైద్యులను కూడా పంపాలని ఆయన అందులో పేర్కొన్నారు.

ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఈ మేరకు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను ఆయన కోరారు. పరిశ్రమలను కాలుష్యం లేని ప్రత్యేక ప్రాంతాలకు తరలించాల్సి ఉందని చెప్పారు. పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు వెంటనే నిపుణులను పంపాలని ఆయన కోరారు.

More Telugu News