Vizag Gas Leak: విశాఖ దుర్ఘటన బాధితులు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేసిన టాలీవుడ్ నటులు!

Maheshbabu Heartwrenching to hear the news of VizagGasLeak
  • ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి 
  • చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలి
  • ఈ భయంకర ప్రమాదం కలచి వేసింది
విశాఖపట్నంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఓ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకైన ఘటనపై టాలీవుడ్‌ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. విశాఖ గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన వార్త తన హృదయాన్ని బాధించిందని మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

'నా జీవితంలో చాలా ప్రత్యేకమైన ప్రాంతాల్లో ఒకటైన వైజాగ్‌ను ఈ పరిస్థితుల్లో చూస్తోంటే నా హృదయం పగిలినంత పనైంది. ఈ భయంకర ప్రమాదం నన్ను కలచి వేసింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాను' అని సినీనటుడు అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

ఇంకా సినీనటులు రవితేజ, నాని, తమన్నా స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉదయాన్నే విషాదకర వార్త తెలుసుకుని చాలా బాధపడినట్లు వారు ట్వీట్లు చేశారు.
Vizag Gas Leak
Vizag
Mahesh Babu
Allu Arjun
Tollywood

More Telugu News