తెలంగాణలో దుమ్మురేపిన మద్యం అమ్మకాలు... ఏపీ రికార్డు బద్దలు!
- లాక్ డౌన్ తర్వాత రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు
- ఏపీలో తొలిరోజు రూ.. 67 కోట్ల అమ్మకాలు
- తెలంగాణలో ఫస్ట్ డే సేల్స్ రూ. 90 కోట్లు
తెలంగాణలో ఈ రోజు లిక్కర్ షాపులు తెరుచుకోవడంతో, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమ్మకాలు జరిగాయి. షాపులను తెరవకముందే జనాలు బారులుతీరారు. సరాసరిన 16 శాతం వరకు మద్యం ధరలను పెంచినప్పటికీ మందుబాబులు ఏమాత్రం తగ్గలేదు. దాంతో, రికార్డు స్థాయిలో ఈరోజు రూ. 90 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు అధికారులు తెలిపారు.