KCR: కేసీఆర్ ను కలసి రూ. కోటి విరాళాన్ని అందించిన లలిత జువెలర్స్ సీఎండీ కిరణ్ కుమార్

Lalitha Jewellrs Kiran Kumar 1 cr donation to CMRF
  • ఏపీ, తమిళనాడుకు కూడా కోటి వంతున విరాళం
  • కేసీఆర్ కు రూ. 40 కోట్ల చెక్ అందించిన సింగరేణి కాలరీస్
  • దాతలకు ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్
లలిత జువెలర్స్ సీఎండీ కిరణ్ కుమార్ పెద్ద మనసును చాటుకున్నారు. కరోనా వైరస్ బాధితులను, పేదవారిని ఆదుకోవడానికి సీఎం సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి రూ. కోటి చెక్ ను అందజేశారు. మరోవైపు ఏపీ, తమిళనాడు రాష్ట్రాలకు కూడా చెరో కోటి రూపాయల విరాళాన్ని కిరణ్ కుమార్ ప్రకటించారు.
.పేదలను ఆదుకునేందుకు సింగరేణి కాలరీస్ కూడా తన వంతు సాయాన్ని అందించింది. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 40 కోట్ల విరాళాన్ని అందించింది. దీనికి సంబంధించిన చెక్కును కేసీఆర్ కు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ అందించారు. మరోవైపు, దాతలందరికీ కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
KCR
Lalitha Jewellers
Kiran Kumar
Donation

More Telugu News