Salman Khan: ఒకవేళ  నా బయోపిక్ తీస్తే.. నా పాత్రను ఆయనే పోషించాలి: షోయబ్ అఖ్తర్

Salman to play my role in my biopic
  • నా పాత్రను సల్మాన్ పోషించాలన్న అఖ్తర్
  • సల్మాన్ కు అఖ్తర్ పెద్ద అభిమాని
  • ఫౌండేషన్ ద్వారా ఎంతో సేవ చేస్తున్నాడని ప్రశంస
తన జీవిత చరిత్ర ఆధారంగా ఎవరైనా బయోపిక్ ను తెరకెక్కిస్తే... ఆ సినిమాలో తన పాత్రను బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పోషించాలనేది తన కోరిక అని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ అన్నాడు. సల్మాన్ ఖాన్ కు షోయబ్ పెద్ద అభిమాని కావడం గమనార్హం. గతంలో దుబాయ్ లో సల్మాన్ ను కలిసిన తర్వాత ఆ సంతోషాన్ని అఖ్తర్ అందరితో పంచుకున్నాడు.

సల్మాన్ తో గడపడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పాడు. 'బీయింగ్ హ్యూమన్' ఫౌండేషన్ ద్వారా సల్మాన్ ఎంతో సేవ చేస్తున్నాడని ప్రశంసించాడు. మరోవైపు, ఇప్పటికే బాలీవుడ్ లో క్రికెటర్ల జీవితం ఆధారంగా కొన్ని సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. సచిన్, ధోనీ సినిమాలు ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నాయి. కపిల్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా విడుదల కావాల్సి ఉంది.
Salman Khan
Bollywood
Shoib Akhtar
Pakistan
Biopic

More Telugu News