Hizbul: హిజ్బుల్ టాప్ కమాండర్‌ను చుట్టుముట్టిన సైన్యం.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

Top Hizbul terrorist Riyaz Naikoo trapped
  • శార్షాలిలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం
  • బీగ్‌పొరాలో  రియాజ్ నైకూను చుట్టుముట్టిన భద్రతా దళాలు
  • కొనసాగుతున్న కాల్పులు
సైనికుల వీరమరణానికి భారత భద్రతా దళాలు ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

శార్షాలి గ్రామంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో గ్రామానికి చేరుకున్న సైన్యం గాలింపు చేపట్టింది. వీరిని చూసిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి సైన్యం పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకుంది.

మరోవైపు, ఇదే జిల్లాలోని బీగ్‌పొరాలో హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఇక్కడ హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కాగా, జమ్మూకశ్మీర్ పోలీసులు, భద్రతా దళాలు జిల్లాలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో సంయుక్త ఆపరేషన్ చేపట్టి ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి.
Hizbul
Terrorist
Jammu And Kashmir
Indian army

More Telugu News