Jagan: ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ను ప్రారంభించిన సీఎం జగన్.. ఆయా ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ

AP CM Jagan inaugurates YSR Matsyakara Bharosa
  • లక్షా తొమ్మిది వేల మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి  
  • ‘కరోనా’పై పోరులో ప్రభుత్వానికి చాలా కష్టాలు ఉన్నాయి
  • మత్స్యకారుల కష్టాలు మరింత పెద్దవిగా భావించామన్న సీఎం 
వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. జగన్ బటన్ నొక్కగానే మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమయ్యాయి. ఈ పథకం ద్వారా లక్షా తొమ్మిది వేల మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరింది.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. ‘కరోనా’పై పోరులో ప్రభుత్వానికి చాలా కష్టాలు ఉన్నాయని, మత్స్యకారుల కష్టాలు మరింత పెద్దవిగా భావించడం వల్లే వారికి సాయం చేస్తున్నామని అన్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునే నిమిత్తం ఈ పథకం ప్రవేశపెట్టామని చెప్పారు.

ఈ సందర్భంగా జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి మోపిదేవి వెంకటరమణ, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్ నీలం సాహ్ని, కలెక్టర్లు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మత్స్యకారులతో ఆయన మాట్లాడారు.
Jagan
YSRCP
Andhra Pradesh
YSR Matsyakara Bharosa

More Telugu News