Nara Lokesh: పేర్ని నాని వ్యాఖ్యలపై ట్విట్టర్ లో బదులిచ్చిన నారా లోకేశ్

Nara Lokesh replies to Perni Nani comments
  • ఏపీలో మద్యం అమ్మకాల వివాదం
  • టీడీపీ నేతలను డబ్బులిచ్చి పంపారంటూ పేర్ని నాని వ్యాఖ్యలు
  • వీళ్లు ఆంధ్రప్రదేశ్ మంత్రులు అంటూ లోకేశ్ వ్యంగ్యం
రాష్ట్రంలో మద్యం అమ్మకాల వ్యవహారం వైసీపీ, టీడీపీ నేతల మధ్య అగ్గి రాజేసింది. టీడీపీ కార్యకర్తలను వైన్ షాపుల వద్ద డబ్బులిచ్చి నిలబెట్టారంటూ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై నారా లోకేశ్ స్పందించారు. 'వీళ్లు ఆంధ్రప్రదేశ్ మంత్రులు' అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. పేటీఎం బ్యాచ్ కి కవరింగ్ చేయడానికి సమయం కూడా ఇవ్వట్లేదు కదా సామీ అంటూ ఎద్దేవా చేశారు. తన ట్వీట్ తో పాటు మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా లోకేశ్ జత చేశారు.
Nara Lokesh
Perni Nani
Liquor Sales
Andhra Pradesh
Lockdown
Corona Virus

More Telugu News