KCR: ఈ నెల 29 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నాం: సీఎం కేసీఆర్

Lock down extends in Telangana
  • ముగిసిన క్యాబినెట్ సమావేశం
  • లాక్ డౌన్ ఒక ఆయుధం అని పేర్కొన్న సీఎం కేసీఆర్
  • దాదాపుగా విజయం సాధించామని వెల్లడి
  • సంపూర్ణ విజయం కోసం ప్రయత్నించాలని ప్రజలకు పిలుపు
తెలంగాణలో కరోనా వ్యాప్తిని మరింతగా నియంత్రించే ఉద్దేశంతో ఈ నెల 29 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దాదాపు ఏడు గంటలకు పైగా కొనసాగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

మన చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం లాక్ డౌన్ అని, భౌతికదూరం పాటిస్తూ విజయం సాధించగలిగామని, మరికొంత కాలం పంటి బిగువనో, ఒంటి బిగువనో ఓర్చుకుంటే సంపూర్ణ విజయం సాకారమవుతుందని అన్నారు. ఇవాళ కొత్తగా 11 మందికి కరోనా నిర్ధారణ అయిందని, తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1096 అని, ప్రస్తుతానికి 439 యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 3.37 ఉంటే, రాష్ట్రంలో 2.54 మాత్రమేనని వెల్లడించారు.
KCR
Lockdown
Telangana
Corona Virus

More Telugu News