Devineni Uma: తాడేపల్లి రాజప్రాసాదం వీడి ప్రజల కష్టాలు తెలుసుకోండి జగన్ గారూ!: దేవినేని ఉమ

Devineni Uma terms YS Jagan inexperience CM
  • టీడీపీ, వైసీపీ మధ్య మద్యం రగడ
  • ప్రజలు ఇబ్బందిపడుతున్నారన్న ఉమ
  • సీఎం అనుభవలేమికి నిదర్శనం అంటూ ట్వీట్
మద్యం అమ్మకాల అంశం ఏపీలో అధికార, విపక్షాల మధ్య మరింత ఆజ్యం పోసింది. నిన్నటినుంచి విమర్శలు, ప్రతి విమర్శలతో వాతావరణం మరింత వేడెక్కింది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. సీఎం జగన్ తాడేపల్లి రాజప్రాసాదం వీడి ప్రజల కష్టాలు తెలుసుకోవాలని హితవు పలికారు. లాక్ డౌన్ వల్ల పనులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సంపద సృష్టించడం చేతకాని ప్రభుత్వం విద్యుత్ చార్జీలు, మద్యం అమ్మకాల ద్వారా పేద, మధ్య తరగతి వర్గాల నడ్డి విరిచి ఆదాయం రాబట్టుకోవాలనుకుంటోందని విమర్శించారు. ఇలాంటి చర్యలు సీఎం అనుభవలేమికి నిదర్శనాలని ట్వీట్ చేశారు.
Devineni Uma
Jagan
Andhra Pradesh
Liquor Sales
Lockdown
Corona Virus

More Telugu News