Sensex: ఈ రోజు కూడా నష్టాల్లోనే ముగిసిన మార్కెట్లు

  • 261 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 87 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 4.64 శాతం నష్టపోయిన ఎస్బీఐ
Sensex ends 261 points lower

నిన్న భారీగా పతనమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాల్లోనే ముగిశాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు నష్టాల్లో ట్రేడ్  అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 261 పాయింట్లు నష్టపోయి 31,453కు పడిపోయింది. నిఫ్టీ 87 పాయింట్లు కోల్పోయి 9,205కి జారిపోయింది. రియాల్టీ, బ్యాంకెక్స్ సూచీలు ఎక్కువగా నష్టపోయాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (3.12%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.93%), ఓఎన్జీసీ (2.61%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.78%), ఎన్టీపీసీ (1.26%).

టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-4.64%),బజాజ్ ఫైనాన్స్ (-3.76%), ఏసియన్ పెయింట్స్ (-3.44%), యాక్సిస్ బ్యాంక్ (-3.38%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-3.01%).

More Telugu News