Sartiha Komati reddy: భారత సంతతికి చెందిన సరితా కోమటిరెడ్డికి అమెరికాలో కీలక పదవి!

 Indian American Attorney Saritha Komatireddy as Federal Court Judge
  • ఇండో- అమెరికన్ అటార్ని సరితా కోమటిరెడ్డి
  • న్యూయార్క్ ఫెడరల్ కోర్టు జడ్జిగా నియమిస్తూ నిర్ణయం
  • ఈ మేరకు సెనేట్ కు ట్రంప్ సిఫారసు  

అమెరికాలో మరో భారత సంతతి మహిళకు ఓ కీలక పదవి దక్కనుంది. ఇండో- అమెరికన్ అటార్ని సరితా కోమటిరెడ్డిని న్యూయార్క్ ఫెడరల్ కోర్టు జడ్జిగా నియమిస్తూ యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సెనేట్ కు సిఫారసు చేశారు. సెనేట్ ఆమోదిస్తే న్యూయార్క్ లోని తూర్పు జిల్లా కోర్టు జడ్జిగా ఆమె విధులు నిర్వహించనున్నారు.

కాగా, ప్రస్తుతం ఆమె న్యూయార్క్ లోని తూర్పు జిల్లా అటార్నీ జనరల్ సాధారణ నేరాల విభాగానికి డిప్యూటీ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఆమె గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. అంతర్జాతీయ నార్కోటిక్స్, మనీలాండరింగ్, హాకింగ్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కో ఆర్డినేటర్ గా ఆమె పని చేశారు. హార్వర్డ్  లా స్కూల్ నుంచి పట్టా అందుకున్న తర్వాత న్యాయశాస్త్ర విభాగంలో లెక్చరర్ గా పని చేశారు.

కొలంబియా స్కూల్, వాషింగ్టన్ యూనివర్శిటీ లా స్కూల్ లో విద్యార్థులకు పాఠాలు బోధించారు. యూఎస్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ ఫర్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ జడ్జి బ్రెట్ కావానా వద్ద  లా క్లర్క్ గా కూడా ఆమె పనిచేశారు. తెలంగాణకు చెందిన వ్యక్తి సరితా కోమటిరెడ్డి. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులు.

  • Loading...

More Telugu News