RGV: నిన్న పోస్ట్ చేసిన అమ్మాయిల ఫొటోపై రామ్ గోపాల్ వర్మ వివరణ!

ram gopal varma on women at wine shops
  • నిన్నటి వర్మ ట్వీట్‌పై విమర్శలు
  • అమ్మాయిలకు కూడా మద్యం కొనుక్కునే హక్కు ఉందని ఒకరి ట్వీట్
  • ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన వర్మ
  • తనను తప్పుగా అర్థం చేసుకున్నారని వ్యాఖ్య
'మద్యం దుకాణాల ముందు ఎవరు నిలుచున్నారో చూడండి' అంటూ బెంగళూరులో కొందరు అమ్మాయిలు వైన్ షాపుల ముందు మద్యం కోసం నిలబడిన ఫొటోను దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ నిన్న ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన షటప్‌సోనా అనే ఒకరు వర్మపై మండిపడ్డారు. మహిళలకు కూడా పురుషులలాగే మద్యం కొనుక్కుని, తాగే హక్కు ఉంటుందని అన్నారు. అయితే, తాగి హింస సృష్టించే హక్కు మాత్రమే ఉండదని అన్నారు. నైతికతను విస్మరిస్తూ వర్మ పోస్టు చేయడం సరికాదంటూ విమర్శలు గుప్పించారు

తనపై విమర్శలు గుప్పిస్తూ చేసిన ఆ ట్వీట్‌ను వర్మ రీట్వీట్ చేస్తూ... 'హేయ్.. నా ట్వీట్‌ను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారనుకుంటా. ఇతరుల విషయంపై ఓ అభిప్రాయానికి వచ్చి తీర్పు ఇవ్వాలని భావించే వారిలో నేను చివరి వరసలో ఉంటాను. పురుషులు మాత్రమే తాగుతారని, ఆ మత్తులో మహిళలను దూషిస్తారని తప్పుగా భావించే నాయకులను ఉద్దేశించే ఇది' అని చెప్పారు.
RGV
Tollywood
Lockdown
Twitter

More Telugu News