Sudigali Sudheer: రొమాంటిక్ మూవీలో హీరోగా సుధీర్ .. హీరోయిన్ గా రష్మీ?

Sekhar Raju Movie
  • 'సాఫ్ట్ వేర్ సుధీర్' నిర్మాత నుంచి మరో సినిమా
  • రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సాగే కథ
  • అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి

బుల్లితెరపై 'సుడిగాలి' సుధీర్ కి .. రష్మీకి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఈ జోడీ ఇంతటి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇద్దరూ కూడా వెండితెరపై తమని తాము నిరూపించుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరినీ కలిసి వెండితెరపై చూడటానికి అభిమానులు ముచ్చట పడుతున్నారు. వాళ్ల కోరిక త్వరలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇటీవల కాలంలో సుధీర్ హీరోగా రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో 'సాఫ్ట్ వేర్ సుధీర్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి శేఖర్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు. ఆ సినిమా సమయంలోనే తరువాత సుధీర్ - రష్మీ జోడీగా ఒక సినిమా చేయాలనుందని అన్నాడు. ఆయనే ఇప్పుడు సుధీర్ - రష్మీ కాంబినేషన్లో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ ను చేయడానికి రంగంలోకి దిగినట్టుగా సమాచారం. ఇక వెండితెరపై ఈ ఇద్దరూ కలిసి చేసే సందడి ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

  • Loading...

More Telugu News