UAE: బతుకుదెరువు కోసం వెళ్లి.. జాక్ పాట్ కొట్టిన భారతీయుడు!

  • అజ్మన్ లో పని చేస్తున్న కేరళ వాసి
  • ఏప్రిల్ 14న ఆన్ లైన్ లో లాటరీ కొనుగోలు
  • రూ. 20.63 కోట్ల జాక్ పాట్ కొట్టిన వైనం
పొట్టకూటి కోసం దేశంకాని దేశానికి వెళ్లిన వ్యక్తిని అదృష్ట లక్ష్మి వరించింది. వివరాల్లోకి వెళ్తే కేరళకు చెందిన దిలీప్ కుమార్ ఎల్లికొట్టిల్ పరమేశ్వరన్ బతుకుదెరువు కోసం యూఏఈలోని అజ్మన్ కు వెళ్లాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడేళ్ల క్రితం కుటుంబంతో కలిసి అక్కడకు వెళ్లాడు. ఆటో స్పేర్ పార్ట్స్ కంపెనీలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య గృహిణి కావడంతో కుటుంబ పోషణ మొత్తం అతని పైనే పడింది.

ఈ నేపథ్యంలో, ఏప్రిల్ 14న ఆన్ లైన్ లో ఆయన లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. నిన్న తీసిన లక్కీ డ్రాలో జాక్ పాట్ కొట్టాడు. ఏకంగా రూ. 20.63 కోట్లు గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశాడు. గెలిచిన డబ్బుతో మొదట అప్పులను తీర్చేస్తానని చెప్పాడు. మిగిలిన డబ్బును తన పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగిస్తానని తెలిపాడు.
UAE
Ajman
Lottery
Kerala

More Telugu News