ICMR: గంగానది నీటితో ‘కరోనా’పై క్లినికల్ ట్రయల్స్ జరపాలి.. ఐసీఎంఆర్ కి ఆసక్తికర ప్రతిపాదన!

  • ఆసక్తికర ప్రతిపాదన చేసిన గంగా శుద్ధి జాతీయ మిషన్ (ఎన్ఎంసీజీ)  
  • జలశక్తి మంత్రిత్వ శాఖ లోని ఎన్ఎంసీజీ
  • ఇదే విషయమై ఇప్పటికే విజ్ఞప్తి చేసిన  ‘అతుల్య గంగ’  
An interesting proposal for ICMR

కరోనా వైరస్ పై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) కి  గంగా శుద్ధి జాతీయ మిషన్ (ఎన్ఎంసీజీ)  ఓ ఆసక్తికర ప్రతిపాదన చేసింది. పవిత్ర గంగానది జలాలతో ‘కరోనా’ వైరస్ పై క్లినికల్ ట్రయల్స్ జరపాలని కోరుతూ జలశక్తి మంత్రిత్వ శాఖ లోని ఎన్ఎంసీజీ ప్రతిపాదించింది. ఇదే విషయమై అతుల్య గంగ సంస్థ కూడా ఓ వినతి చేసింది. ఈ నేపథ్యంలో ఎన్ఎంసీజీ ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది.

కాగా, ఆర్మీలో పని చేసి పదవీ విరమణ పొందిన వారు ఏర్పాటు చేసిన సంస్థ ‘అతుల్య గంగ’. ఈ  సంస్థ వ్యవస్థాపకుడు రిటైర్డ్ మేజర్ మనోజ్ కేశ్వర్ మాట్లాడుతూ, గంగా నది పవిత్రమైందని, ఆ నీటికి ఉన్న ప్రత్యేక లక్షణాల వల్ల అది కరోనా వైరస్ ను చంపుతుందేమో పరిశీలిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా, లాక్ డౌన్ కారణంగా గంగానదిలో కాలుష్యం కూడా చాలా వరకు తగ్గిందని, చాలా ప్రదేశాల్లో ఈ నది నీటిని తాగొచ్చని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) తెలిపింది.

More Telugu News