Rashi Khanna: తమిళ సినిమాలపై దృష్టిపెట్టిన రాశిఖన్నా

Rashi Khanna getting offers in Tamil
  • గ్లామరస్ హీరోయిన్ గా రాశి ఖన్నా
  •  తెలుగులో పెంచిన దూకుడు
  • తమిళంలో వరుస అవకాశాలు
మొదటి నుంచి కూడా రాశి ఖన్నా కెరియర్ పరంగా దూకుడు చూపించినట్టుగా కనిపించదు. నిదానమే ప్రధానం అన్నట్టుగా ఆమె ఒక్కో సినిమా చేస్తూ వెళుతోంది. ఇటీవలే ఆమె తెలుగులో తన దూకుడు పెంచింది .. అలాగే గ్లామర్ డోస్ కూడా కాస్త పెంచింది. అంతేకాదు తమిళ సినిమాలపై కూడా ఆమె దృష్టిపెట్టింది.

అక్కడ 'అరువా' అనే సినిమాలో సూర్య సరసన ఛాన్స్ కొట్టేసింది. అంతేకాదు 'సైతాన్ కా బచ్చా' అనే సినిమాలోనూ .. 'అరన్మణి' సీక్వెల్ లోను అవకాశాలను దక్కించుకుంది. ఈ మూడు సినిమాల్లోను ఆమె ప్రాధాన్యత కలిగిన పాత్రలనే చేస్తూ ఉండటం విశేషం. సుందర్ .సి దర్శకత్వం వహిస్తున్న 'అరన్మణి 3 ' సినిమాలో రాశి ఖన్నా ప్రధానమైన పాత్రను పోషించనుంది. ఈ మూడు సినిమాలపై ఆమె బాగానే ఆశలు పెట్టుకుంది. ఆ సినిమాలు హిట్ అయితే రాశి ఖన్నా అక్కడ బిజీ కావడం ఖాయమేనని చెప్పొచ్చు.
Rashi Khanna
Actress
KollyWood

More Telugu News