India: 11 లక్షలకు పైగా శాంపిళ్లను పరీక్షించిన భారత్‌లోని ల్యాబులు

A total of 1107233 samples have been tested as on 4th May 9 AM ICMR
  • కరోనా పరీక్షల కోసం ప్రస్తుతం 315 ప్రభుత్వ, 111 ప్రైవేటు ల్యాబులు 
  • 363 ల్యాబుల్లో కరోనా నిర్ధారణ కోసం ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు
  • 42 ల్యాబుల్లో టీఎన్‌ టెస్ట్‌లు,
  • 21 ల్యాబుల్లో సీబీఎన్‌ఏఏటీ పరీక్షలు  
భారత్‌లో కరోనా విజృంభణ నేపథ్యంలో పెద్ద ఎత్తున పరీక్షలు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటల వరకు మొత్తం దేశంలో 11,07,233 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రకటన చేసింది. దేశంలో కరోనా పరీక్షల కోసం ప్రస్తుతం 315 ప్రభుత్వ, 111 ప్రైవేటు ల్యాబులు ఉన్నాయని ఐసీఎంఆర్ వివరించింది.

ఆ ల్యాబులు పరీక్షలు నిర్వహించి, తమకు నివేదికలు అందిస్తున్నాయని తెలిపింది. దేశంలోని 363 ల్యాబుల్లో కరోనా నిర్ధారణ కోసం ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపింది. దేశంలో 42 ల్యాబుల్లో టీఎన్‌ టెస్ట్‌లు, 21 ల్యాబుల్లో సీబీఎన్‌ఏఏటీ పరీక్షలు నిర్వహిస్తున్నారని వివరించింది. కాగా, దేశంలో కరోనా కేసుల సంఖ్య 42,533కు చేరిన విషయం తెలిసిందే. మృతుల సంఖ్య 1,373గా ఉంది.
India
ICMR
COVID-19

More Telugu News