Pragathi: ఆ స్టార్ కమెడియన్ నాకు పొగరు అని ప్రచారం చేశాడు: నటి ప్రగతి

Pragathi
  • ఆయన ధోరణి నాకు నచ్చలేదు
  •  నన్ను ఇబ్బంది పెట్టాడు
  • మంచి పద్ధతి కాదని చెప్పానన్న ప్రగతి  
తెలుగులో యంగ్ హీరో .. హీరోయిన్స్ కి తల్లిగా ప్రగతి మంచి పాత్రలను పోషించింది. ఆ మధ్య వచ్చిన 'ఎఫ్ 2' సినిమాలో ఆమె సాగదీస్తూ డైలాగ్స్ చెప్పిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అలాంటి ప్రగతి తన కెరియర్లో తనకి ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గురించి ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

"ఒక స్టార్ కమెడియన్ కాంబినేషన్లో కొన్ని సినిమాలు చేశాను. ఒక సినిమా షూటింగులో మాత్రం ఆయన మాటలు .. చేష్టలు కాస్త తేడాగా అనిపించాయి. ఆయన ధోరణి నాకు చాలా బాధను కలిగించింది. దాంతో విరామ సమయంలో కారవాన్ లో ఆయనను కలిశాను. ఆయన పద్ధతి బాగోలేదనీ, ఆయన ప్రవర్తన కారణంగా తాను చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పాను. ఈ విధంగా వ్యవహరించడం మంచిది కాదని గట్టిగానే చెప్పాను. అప్పుడు ఆయన మౌనంగానే వుండిపోయాడు. ఆ తరువాత మాత్రం నాకు చాలా పొగరు ఎక్కువని ప్రచారం చేశాడు" అని చెప్పుకొచ్చారు.
Pragathi
Actress
Tollywood

More Telugu News