కుమారుడికి ఆహారం తినిపించే విషయంలో గొడవ.. బెల్ ఇంజినీర్‌ను పొడిచి చంపిన భార్య
- కత్తితో భర్తను దారుణంగా పొడిచిన భార్య
- ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి
- బాధితుడిది ఝార్ఖండ్
అది మరింత ముదరడంతో ఆగ్రహం పట్టలేని భార్య అఖిలకుమారి భర్తపై కత్తితో దాడిచేసింది. తీవ్రంగా గాయపడిన అఖిలేశ్‌ను స్థానికులు వెంటనే బెల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మరింత మెరుగైన చికిత్స కోసం రాణిపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా అఖిలేశ్ మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. అఖిలేశ్ తల్లి సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిప్కాట్ పోలీసులు నిందితురాలు అఖిలకుమారిని అరెస్ట్ చేశారు.