అమెరికా కంపెనీ సిల్వర్ లేక్‌తో జియో మరో భారీ డీల్!
- ఇటీవలే జియోలో పెట్టుబడులు పెట్టిన ఫేస్‌బుక్
- జియోలో సిల్వర్ లేక్ రూ.5,655.75 కోట్ల పెట్టుబడులు
- ప్రకటించిన ఆర్ఐఎల్, జియో
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఈ రోజు ఓ ప్రకటన చేశాయి. జియో ప్లాట్‌ఫ్లామ్స్‌లలో సిల్వర్ లేక్ రూ. 5,655.75 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు అందులో పేర్కొన్నాయి. జియో ప్లాట్‌ఫామ్స్‌లలో పెట్టే ఈ పెట్టుబడి ఈక్విటీ విలువ రూ. 4.90 లక్షల కోట్లు కాగా, ఎంటర్‌ప్రైజ్ విలువ రూ.5.15 లక్షల కోట్లని ఆర్ఐఎల్, జియో ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.