Corona Virus: భారత్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతోన్న కేసులు.. 24 గంటల్లో 2,553 మందికి కరోనా నిర్ధారణ

Coronavirus cases in India cross 42000mark 1373 deaths
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి, మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజురోజుకీ కొవిడ్‌-19 కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో భారీగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా నమోదైన కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గత 24 గంటల్లో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 2,553 కేసులు నమోదయ్యాయి.  

దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,373కి చేరింది. కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 42,533కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 11,707  మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 29,453 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News