Pawan Kalyan: ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్

Pawan Kalyan appreciates AP Government and TTD
  • టీటీడీలో 1400 మందిని తొలగించారంటూ ఇటీవల ఎలుగెత్తిన పవన్
  • వారికి ప్రభుత్వం ఊరట కలిగించడంపై హర్షం
  • మానవత్వం చాటారంటూ ప్రభుత్వానికి, టీటీడీకి అభినందనలు
ఇటీవల టీటీడీలో 1400 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులపై వేటు పడిందంటూ జనసేనాని పవన్ కల్యాణ్ ఎలుగెత్తారు. వారిని ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో, టీటీడీ ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఊరట కల్పించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి కృతజ్ఞతలు తెలియజేశారు.

1400 మంది కార్మికులను కొనసాగించాలంటూ తీసుకున్న నిర్ణయం సముచితంగా ఉందని పేర్కొన్నారు. కార్మికులను విధుల్లోకి తీసుకుని మానవత్వం చాటారని కొనియాడారు. వారంతా శ్రీవారిని నమ్ముకుని 15 ఏళ్లుగా కొద్దిపాటి వేతనాలకే పారిశుద్ధ్య సేవ చేస్తున్నారని పవన్ వెల్లడించారు. కార్మికుల కోసం ప్రభుత్వం చేసే ప్రతిపనికీ జనసేన సహకారం ఉంటుందని తెలిపారు.
Pawan Kalyan
Andhra Pradesh
TTD
Outsourcing
Lockdown
Corona Virus

More Telugu News