Andhra Pradesh: ఏపీలో పెరగనున్న మద్యం ధరలు

Going to increase liquor prices in Andhrapradesh
  • ఏపీలో మద్యం నియంత్రణ దిశగా ముందెళ్తున్న  ప్రభుత్వం
  • పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలు జరపాలని నిర్ణయం 
  • మద్యపానాన్ని నిరుత్సాహపరిచి, దుకాణాల వద్ద రద్దీ తగ్గింపునకు ఈ నిర్ణయం
ఏపీలో మద్యం నియంత్రణ దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. మద్యం ధరలను 25 శాతం పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మద్యపానాన్ని నిరుత్సాహపరిచి, దుకాణాల వద్ద రద్దీ తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రానున్న రోజుల్లో మద్యం దుకాణాల సంఖ్య తగ్గించాలని నిర్ణయించినట్టు సమాచారం. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం మద్యం దుకాణాలు తెరచుకోనున్నాయి. భౌతిక దూరం పాటించి మద్యం విక్రయించాలని ప్రభుత్వం ఆదేశించింది.
Andhra Pradesh
Liquor prices
hike
Government

More Telugu News