Renu Desai: తల్లి పాత్రలు పోషిస్తారా? అనే ప్రశ్నకు నటి రేణూదేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Renu Desai video
  • మహేశ్, ప్రభాస్ లకు తల్లి పాత్రల్లో నటించేందుకు సిద్ధం
  • అయితే, నాకు ఇచ్చే పాత్ర బాగుండాలి
  • వృద్ధురాలి పాత్రలు పోషించేందుకు సిద్దమే 
సినిమాల్లోకి మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్న ప్రముఖ నటి రేణూదేశాయ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తల్లి పాత్రలు పోపిష్తారా? అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ, ప్రముఖ హీరోలు మహేశ్ బాబు, ప్రభాస్ లకు తల్లి పాత్రలో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే, పాత్ర బాగుండాలని అన్నారు.

మంచి అవకాశాలు వస్తే,  హీరో చిన్నతనంలో లేదా ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో తల్లి పాత్ర పోషిస్తానని చెప్పారు. అవసరమైతే, మేకప్ వేసుకుని వృద్ధురాలి పాత్రలు వేసేందుకు తనకు అభ్యంతరం లేదని అన్నారు. కాగా, రైతు నేపథ్యంలో ఓ చిత్రం తీయబోతున్న రేణూదేశాయ్ ఈ ప్రాజెక్టు నిమిత్తం ఇటీవల ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడి ప్రజలను, చిన్నారులను కలిశారు. ఇందుకు సంబంధించిన వీడియోను రేణూ దేశాయ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సినిమా తన మనసుకు ఎంతో దగ్గరైందని పేర్కొన్నారు.
Renu Desai
Artist
Tollywood

More Telugu News