Corona Virus: ఏపీలో పెరిగిపోయిన కరోనా కేసులు.. కర్నూలులో 466కి చేరిన వైనం

coronavirus cases in ap
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 6,534 శాంపిళ్లను పరీక్షించగా 58 మందికి కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,583గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 488 మంది డిశ్చార్జ్ కాగా, 33 మంది మరణించారని వివరించింది.

ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,062గా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 7, చిత్తూరులో 1, గుంటూరులో 11, కృష్ణాలో 8, కర్నూలులో 30, నెల్లూరులో 1 కేసు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కర్నూలులో మొత్తం కేసులు 466కి చేరాయి. 

జిల్లాల వారీగా వివరాలు...            
                                  
గ్రాఫ్ రూపంలో..
                                      
Go Back to Shorts
Corona Virus
COVID-19
Andhra Pradesh

More Telugu News