Utthav Thakre: ఉద్ధవ్ థాకరే ఇంటి ఎదురుగా ఉండే సెక్యూరిటీ సిబ్బందిలో ముగ్గురికి కరోనా... అధికారుల్లో కలకలం!

Three of Security Employees of Maharashtra CM Gets Corona
  • సీఎం నివాసం ఎదుట విధులు
  • ముంబై ఆయుధ విభాగానికి చెందిన సిబ్బంది
  • సీఎం సెక్యూరిటీ విధుల్లో కొత్తవారి నియామకం
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే సెక్యూరిటీ సిబ్బందిలోని ముగ్గురికి కరోనా సోకింది. సీఎం నివాసం 'మాతో శ్రీ' నివాసం ఎదురుగా ఉండే వీరికి శనివారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వీరు ముంబై పోలీసు శాఖ స్థానిక ఆయుధ విభాగానికి చెందినవారని అధికారులు వెల్లడించారు. సీఎం సెక్యూరిటీ సిబ్బందిలో ముగ్గురు కరోనా బారిన పడటంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు.

జరిగిన ఘటనతో ఇప్పుడున్న భద్రతా  సిబ్బందిని తొలగించి కొత్త సిబ్బందిని నియమించనున్నామని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కాగా, ఇండియాలో అత్యధిక పాజిటివ్ కేసులు ఉన్న రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచిన సంగతి తెలిసిందే. మొత్తం కేసులో 25 శాతానికి పైగా ఇక్కడే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, రాష్ట్రంలో 12,300కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
Utthav Thakre
Security
Mato Sri
Corona Virus

More Telugu News