Hyderabad: స్వస్థలానికి వెళ్లేందుకు హైదరాబాద్ పోలీసుల పాస్ కావాలంటే...!

  • ఈ-పాస్ విధానం అందుబాటులోకి
  • చిక్కుబడిపోయిన వారికి సౌలభ్యం కోసమే
  • వెల్లడించిన డీజీపీ మహేందర్ రెడ్డి
E Pass for Starended People in Telangana

వలస కార్మికులు, విద్యార్థులు సహా, తెలంగాణలో చిక్కుబడిపోయిన ఇతర ప్రాంతాల వారికి ఈ-పాస్ విధానాన్ని అమలులోకి తెచ్చామని, దీన్ని వాడుకుని స్వస్థలాలకు చేరుకోవచ్చని తెలంగాణ డీజీపీ ఎం మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఈ పాస్ కావాలని కోరుకునే వారు https://tsp.koopid.ai/epass. ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, వెరిఫికేషన్ తరువాత పాస్ ను జారీ చేస్తామని వెల్లడించారు. ఈ పాస్ ను ఆన్ లైన్ లోనే పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు.

కాగా, రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు అనుమతిస్తూ, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిన తరువాత, లాక్ డౌన్ కారణంగా చిక్కుబడిపోయిన టూరిస్టులు, యాత్రికులు, విద్యార్థుల సౌకర్యార్థం ఈ విధానాన్ని తీసుకుని వచ్చామని మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఒక కుటుంబానికి చెందిన వారికి రోజుకు ఒక పాస్‌ మాత్రమే జారీ చేస్తామని, కావలసిన వారు పేరు, మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నెంబర్, చిరునామా తదితర వివరాలు ఇవ్వాలని కోరారు. పాస్ పొందిన తరువాత వారు తమ సొంత ప్రాంతాలకు వెళ్లొచ్చని డీజీపీ తెలిపారు.

More Telugu News