Students: మహారాష్ట్ర నుంచి సిద్ధిపేట చేరుకున్న 17 మంది తెలుగు విద్యార్థులు

Telugu students arrived Siddipet from Maharashtra
  • అగ్రికల్చర్ ట్రైనింగ్ కోసం మహారాష్ట్ర వెళ్లిన విద్యార్థులు
  • 7 జిల్లాల నుంచి 42 మంది మహారాష్ట్ర వెళ్లినట్టు గుర్తింపు
  • మహారాష్ట్ర అధికారులతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత
లాక్ డౌన్ కారణంగా తెలుగు విద్యార్థులు, కార్మికులు అనేక రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. ఇప్పుడు వీరందరినీ తీసుకువచ్చేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నడుం బిగించాయి. తాజాగా, మహారాష్ట్ర నుంచి 17 మంది తెలుగు విద్యార్థులు సిద్ధిపేట చేరుకున్నారు. అగ్రికల్చర్ ట్రైనింగ్ కోసం 7 జిల్లాలకు చెందిన 42 మంది విద్యార్థులు మహారాష్ట్ర వెళ్లారు. వీరి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం కావడంతో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మహారాష్ట్ర అధికారులతో మాట్లాడారు. దాంతో  17 మంది అగ్రికల్చర్ విద్యార్థులను ప్రత్యేక బస్సులో తరలించారు. వీరికి తొలుత కరోనా పరీక్షలు నిర్వహించి, అనంతరం హోం క్వారంటైన్ విధించే అవకాశాలున్నాయి.
Students
Siddipet
Maharashtra
K Kavitha
Lockdown
Corona Virus

More Telugu News