Corona Virus: స్వైరవిహారం చేస్తున్న కరోనా... అమెరికా, యూరప్ దేశాల్లో మృత్యుఘంటికలు

  • ప్రపంచవ్యాప్తంగా 34 లక్షల మందికి కరోనా
  • 2.39 లక్షల మంది మృత్యువాత
  • అమెరికాలో 11 లక్షల మందికి వైరస్
Corona rapidly spreading worldwide

కరోనా వైరస్ ఉద్ధృతి ఇప్పట్లో శాంతించేలా కనిపించడంలేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 34 లక్షలు దాటింది. ఇప్పటివరకు ప్రపంచం మొత్తమ్మీద 2,39,566 మంది మృత్యువాత పడ్డారు. 10,80,156 మంది కోలుకున్నారు. ప్రధానంగా అమెరికాలో కరోనా విజృంభణ అత్యంత తీవ్రస్థాయిలో ఉంది. ఈ అగ్రరాజ్యంలో 11,28,460 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 65,435 మంది మరణించారు.

యూరప్ లోనూ ఈ మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. స్పెయిన్ లో 2,15,216 మందికి కరోనా నిర్ధారణ కాగా, 24,824 మంది మరణించారు. ఇటలీలో పరిస్థితి ఇప్పటికీ అదుపులోకి రాలేదు. ఈ పర్యాటక దేశంలో 2,07,428 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 28,236 మంది ప్రాణాలు విడిచారు. బ్రిటన్ లో 1,77,454 పాజిటివ్ కేసులు, 27,510 మరణాలు నమోదు కాగా, జర్మనీలో 1,64,054 పాజిటివ్ కేసులు, 6,735 మరణాలు సంభవించాయి.

ఫ్రాన్స్ లో 1,30,185 పాజిటివ్ కేసులు, 24,594 మరణాలు నమోదయ్యాయి. టర్కీలో 1,22,392 పాజిటివ్ కేసులు, 3,258 మరణాలు, రష్యాలో 1,14,431 పాజిటివ్ కేసులు, 1,169 మరణాలు సంభవించాయి. ఇరాన్ లో 95,646 పాజిటివ్ కేసులు, 6,091 మరణాలు నమోదయ్యాయి.

ఇక, భారత్ విషయానికొస్తే, 37,336 మందికి కరోనా నిర్ధారణ కాగా, 1218 మంది కన్నుమూశారు. అటు, కరోనాకు జన్మస్థానంగా నిలిచిన చైనాలో పరిస్థితి సద్దుమణిగింది. తాజాగా ఒక్క కేసు మాత్రమే నమోదైంది.

More Telugu News