Balakrishna: 400 మంది సిబ్బందికి నిత్యావసర వస్తువులను అందించిన బాలకృష్ణ

Balakrishna distributes essential commodities to 400 staff
  • బసవతారకం ఆసుపత్రిలో మేడే వేడుకలు
  • హౌస్ కీపింగ్, శానిటేషన్ సిబ్బందికి నిత్యావసర వస్తువుల అందజేత
  • పేషెంట్ల సమస్యలకు అడిగి తెలుసుకున్న బాలయ్య
హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలోని హౌస్ కీపింగ్, శానిటేషన్ సిబ్బందికి సినీ నటుడు, ఆసుపత్రి ఛైర్మర్ బాలకృష్ణ నిత్యావసర వస్తువులను అందించారు. మొత్తం 400 మంది సిబ్బందికి 10 నుంచి 12 రోజులకు సరిపడా వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు చేస్తున్న స్కీనింగ్ పరీక్షలను ఆయన పరిశీలించారు. పలువురు పేషెంట్లను పరామర్శించి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లాక్ డౌన్ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై డాక్టర్లతో చర్చించి తగిన సూచనలు చేశారు.
Balakrishna
Basavatarakam Cancer Hospital
Tollywood

More Telugu News