honkong: కరోనా క్రిమిని తరిమేసే 'మాప్-1 రెడీ... తయారు చేసిన హాంకాంగ్ శాస్త్రవేత్తలు!

  • పిచికారీ చేస్తే మూడు నెలల పాటు క్రిమి రహితం
  • పర్యావరణానికి హాని కలుగదు
  • వెల్లడించిన హాంకాంగ్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
Pesticide that Removes Virus Upto 90 Days

ప్రజలు నిత్యమూ వినియోగించే వస్తువులపై ఒకసారి పిచికారీ చేస్తే, కరోనా వైరస్ ను వాటిపై చేరకుండా మూడు నెలల పాటు నిరోధించే సరికొత్త క్రిమి సంహారిణిని హాంకాంగ్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 'మాప్ - 1' అనే ఈ క్రిమి సంహారిణిని తాము పదేళ్ల పాటు శ్రమించి తయారు చేశామని, గత ఫిబ్రవరిలో ప్రయోగ పరీక్షల అనంతరం అనుమతులు లభించాయని సైంటిస్టులు తెలిపారు.

పాఠశాలలు, మాల్స్, క్రీడా ప్రాంగణాల నుంచి గాజు, లోహ, ప్లాస్టిక్ ఉత్పత్తులు, వస్త్రాలు, కలప తదితరాలపై దీని పూతను పిచికారీ చేస్తే, 90 రోజుల పాటు వైరస్ లను, బ్యాక్టీరియాలను వాటి ఉపరితలంపై నిలువకుండా చూడవచ్చని వారు తెలిపారు. దీని కారణంగా పర్యావరణానికి, మానవులకు ఎటువంటి హానీ కలుగదని స్పష్టం చేశారు. ఇక ఈ క్రిమి సంహారిణిని ఇతర దేశాలకు ఎగుమతి చేసే విషయమై ఇంకా ఎటువంటి నిర్ణయాన్నీ తీసుకోలేదని హాంకాంగ్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పష్టం చేసింది.

More Telugu News