Lockdown: అష్టకష్టాలు పడ్డ తర్వాత ఎట్టకేలకు ఏపీ చేరుకున్న మత్స్యకారులు

fishermen reaches ap
  • గుజరాత్‌ నుంచి వేల మంది మత్స్యకారుల తరలింపు
  • ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం
  • విశాఖకు చేరుకున్న 887 మంది మత్స్యకారులు
గుజరాత్‌లో ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స్యకారులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అక్కడ దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటూ, అనారోగ్యం పాలై కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఆహారం, వైద్య సదుపాయం కూడా అందకుండా పోతుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుజరాత్‌లో చిక్కుకుపోయిన ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఆ మత్స్యకారులు ఎట్టకేలకు సొంత ప్రాంతాలకు చేరుకున్నారు.
 
మత్స్యకారులను అధికారులు విడతల వారీగా ఏపీకి తీసుకువస్తున్నారు. ఈ రోజు  ఉత్తరాంధ్రకు చెందిన 887 మంది మత్స్యకారులు  విశాఖకు చేరుకున్నారు.  శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు 396 మంది, విశాఖపట్నం 420, విజయనగరం జిల్లాకు చెందిన వారు 25 మంది ఉన్నారు. మిగతా వారంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారు.

వలస కూలీలను తమ సొంత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అనంతపురం నుంచి రాజస్థాన్‌కు వలస కూలీలను తరలిస్తున్నారు. ‌క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న వారందరినీ ప్రత్యేక బస్సుల్లో తరలిస్తున్నారు.
Lockdown
Andhra Pradesh
Corona Virus

More Telugu News