Avanthi Srinivas: ‘కరోనా’తో ఇబ్బందిపడుతున్న ప్రజలకు ‘హెరిటేజ్’, ‘ఎన్టీఆర్ ట్రస్ట్’ లు ఏమిచ్చాయి?: మంత్రి అవంతి

Minister Avanthi Srinivas lashes out chandrababunaidu
  • చందాలు వసూలు చేసుకోవాల్సిన కర్మ మా పార్టీకి లేదు
  • మా నేతలపై చంద్రబాబు  దుష్ప్రచారం చేస్తున్నారు
  • ప్రజల కోసం చంద్రబాబునాయుడు ఏపీకి రావొచ్చుగా?
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సహా ఆ పార్టీ నేతలపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ‘కరోనా’.. వైసీపీ నాయకులకు ఏటీఎంగా మారిందని,  వసూళ్ల దందాకు పాల్పడుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిన్న చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అవంతి ధ్వజమెత్తారు. జనం పేరిట చందాలు వసూలు చేసుకునే కర్మ తమ పార్టీకి పట్టలేదని అన్నారు.

చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చొని తమ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కరోనా’ సంక్షోభంతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు ‘హెరిటేజ్’, ఎన్టీఆర్ ట్రస్ట్ లు ఏమి ఇచ్చాయి? ప్రజల కోసం చంద్రబాబునాయుడు ఏపీకి రావొచ్చుగా? అని ప్రశ్నించారు. ‘కరోనా’ కట్టడికి పోరాడుతున్న ఏపీకి విరాళాలు అందుతున్నాయని, ఆ విషయాన్ని కూడా టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
Avanthi Srinivas
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News