Harrison Ford: ఎయిర్ పోర్టు రన్ వేపై తృటిలో ప్రమాదం తప్పించుకున్న హాలీవుడ్ దిగ్గజం

Harrison Ford escapes unwanted collision at run way
  • ఏటీసీ సూచనలు తప్పుగా అర్థం చేసుకున్న హ్యారిసన్ ఫోర్డ్
  • ల్యాండింగ్ కు యత్నించిన మరో విమానం
  • అదే సమయంలో రన్ వేపై ఫోర్డ్ నడుపుతున్న విమానం
హాలీవుడ్ నట దిగ్గజం హ్యారిసన్ ఫోర్డ్ కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న ఘటన లాస్ ఏంజెలిస్ లో చోటుచేసుకుంది. 77 ఏళ్ల ఫోర్డ్ నడుపుతున్న విమానం రన్ వేపై వెళుతుండగా, అదే సమయంలో మరో విమానం ల్యాండింగ్ కు యత్నించింది. కానీ రన్ వేపై ఫోర్డ్ నడుపుతున్న విమానం కనిపించడంతో మళ్లీ వెంటనే గాల్లోకి లేచింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సూచనను ఫోర్డ్ తప్పుగా వినడమే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. ఎయిర్ పోర్టు అధికారులు ఈ ఘటనపై విచారణకు తెరదీశారు.

అధికారులు చెప్పిన సూచనలను తాను పూర్తి విరుద్ధంగా, తప్పుగా అర్థం చేసుకున్నానని ఫోర్డ్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు అధికారులకు క్షమాపణలు తెలియజేశారు. స్వతహాగా పైలెట్ అయిన హ్యారిసన్ ఫోర్డ్ గతంలోనూ అనేక సార్లు విమాన ప్రమాదాల నుంచి బయటపడ్డారు. 'ఇండియానా జోన్స్' సిరీస్ చిత్రాలతో ఫోర్డ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Harrison Ford
Los Angelis
Plane
Air Port

More Telugu News